‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తున్న తాజా సినిమాకు ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహంకాళి నాగరాజు నిర్మాత. శనివారం ముంబయిలో ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. ‘నిజాయతీగల వ్యాపారవేత్త కథ ఇది.
ఎలాంటి రాజకీయ పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించుకోకుండా విలువలే ప్రధానంగా జీవితాన్ని నిర్మించుకోవాలన్నది అతని లక్ష్యం. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటన్నదే ఈ సినిమా కథ. ‘ఫీనిక్స్ పక్షి అణచివేయలేని సత్యానికి ప్రతీక. సత్యాన్ని కాల్చవచ్చు. పాతిపెట్టవచ్చు. అణచివేయవచ్చు. కానీ నాశనం చేయలేరు’ అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.