శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కళాహి మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇటీవల ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా చిత్రీకరణ ఎలా సాగిందనే వివరాల్ని వెల్లడించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాం.
దెయ్యాల గురించి అంతగా నమ్మని నేను షూటింగ్ సమయంలో భయపడ్డాను. షూటింగ్ సమయంలో మాకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. రాత్రిళ్లు నిద్రకూడా పట్టేది కాదు. ఈ సినిమాలో ఉన్న హారర్ సీన్స్ మరే సినిమాలో ఉండవు. ఒక్కరే కూర్చొని సినిమా చూడలేరు’ అన్నారు. 1930 నుంచి మూడు కాలాల్లో జరిగే కథ ఇది. స్క్రీన్ప్లే హైలైట్గా నిలుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణసౌరభ్ సూరంపల్లి, కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ, దర్శకత్వం: సాయికిరణ్ దైదా.