శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజకే తెలుసు ఆ కష్టాలెలా ఉంటాయో..? ఎవరెప్పుడు అవకాశం ఇస్తారా అని కళ్ళలో ఒత్తులేసుకుని మరీ చూస్తుంటారు వాళ్లు. అలాంటి దర్శకులలో కసి కూడా బాగానే ఉంటుంది. అందుకే కొత్త వాళ్లు ఎక్కడ కనిపించినా కూడా కాదనకుండా ఛాన్స్ ఇస్తుంటాడు రవితేజ. అలా ఇచ్చిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు తెలుగులో టాప్ డైరెక్టర్స్ అయిపోయారు. మరి రవితేజ సినిమాలతో పరిచయమైన 10 మంది దర్శకులెవరో చూద్దాం..
1. శ్రీను వైట్ల: రవితేజ, శ్రీను వైట్ల కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది. అప్పటికి హీరోగా బ్రేక్ లేని రవితేజతో నీ కోసం సినిమా చేసాడు వైట్ల. ఇది 1999లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం.
2. అగస్త్యన్: ఈ తమిళ దర్శకుడిని తెలుగులో పరిచయం చేసాడు రవితేజ. ఈ అబ్బాయి చాలా మంచోడు అంటూ 2003లో ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
3. యోగి: రామోజీరావు నిర్మాతగా రవితేజ, నమిత జంటగా యోగి ఒక రాజు ఒక రాణి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా 2003లో విడుదలైంది.
4. ఎస్.గోపాల్ రెడ్డి: రవితేజ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది. నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్ 2004లో విడుదలైంది. ఈ సినిమాతోనే డిఓపి ఎస్ గోపాల్ రెడ్డి దర్శకుడు అయ్యాడు.
5. బోయపాటి శ్రీను : మాస్ డైరెక్టర్ బోయపాటిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజ. ఈయన 2005లో భద్ర సినిమాతో తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయ్యాడు.
6. హరీష్ శంకర్ : హరీష్ శంకర్ ను కూడా వర్మ ఫ్యాక్టరీ నుంచి టాలీవుడ్ కు పరిచయం చేసాడు రవితేజ. 2006లో వచ్చిన షాక్ సినిమాతో ఈయన మెగాఫోన్ పట్టుకున్నాడు.
7. సముద్రఖని : 2010 సంక్రాంతికి సముద్రఖని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈయన తెరకెక్కించిన శంభో శివ శంభోకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
8. గోపీచంద్ మలినేని : ఇప్పుడు క్రాక్ సినిమాతో కిరాక్ పుట్టిస్తున్న గోపీచంద్ మలినేనిని 2010లో డాన్ శీనుతో పరిచయం చేసాడు రవితేజ. ఈయనకు మాస్ రాజా బిరుదు ఇచ్చింది కూడా ఈ దర్శకుడే.
9. కె.ఎస్.రవీంద్ర ఉరఫ్ బాబీ : అప్పుడే బాక్సాఫీస్ దగ్గర బలుపు చూపించిన రవితేజలోని పవర్ ను 2014లో టాలీవుడ్ కు పరిచయం చేసాడు బాబీ. అదే ఆయనకు తొలి సినిమా.
10. విక్రమ్ సిరికొండ : ఈ మధ్య కాలంలో రవితేజ ఇచ్చిన అవకాశాన్ని అస్సలు వాడుకోలేకపోయిన దర్శకుడు విక్రమ్ సిరికొండ. ఈయన 2018లో టచ్ చేసి చూడు సినిమాతో దర్శకుడిగా మారాడు.
ఇవి కూడా చదవండి
వకీల్‌సాబ్ పై ఆశలు పెట్టుకున్న మారుతి..!
అరవింద్‌స్వామి-కంగనా రొమాంటిక్ లుక్..' తలైవి' పోస్టర్
‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
తెరపైకి నాగార్జున-పూరీ కాంబినేషన్..?
కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.