Srinidhi Shetty | వెయ్యి కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్ సినిమాలో హీరోయిన్ అయినా.. ఆఫర్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి. టైమ్ కలిసి రాకో, అదృష్టం లేకో శ్రీనిధికి అహా అనిపించే ఒక్క ఆఫర్ రావడం లేదు. ఈ మధ్య విక్రమ్‌తో చేసిన కోబ్రాపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ సినిమా రిజల్ట్ తేడాకొట్టడంతో ఆమె కెరీర్ కూడా ప్రశ్నార్థకంలా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. దానికి తోడు శ్రీనిధికి మరో పెద్ద డిజడ్వాంటేజ్ అంటే ఏజ్ అనే చెప్పాలి. కేజీఎఫ్ హిట్టు కొట్టే నాటికి ఆమె ఏజ్ మూడు పదులు దాటేసింది. పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటేనే కెరీర్ రెక్కలొచ్చాలా ఉంటుంది. అలాంటిది మొదటి హిట్టు పడేనాటికి ముప్పై క్రాస్ అయితే ప్రాక్టికల్‌గా చాన్స్‌ల బాధ తప్పదు.
అలాంటి టైమ్‌లో శ్రీనిధి ఇంటి గుమ్మం దగ్గరి ఓ భారీ ఆఫర్ వచ్చిందట. అది కూడా టాలీవుడ్ నుంచి. బాలయ్య, బాబీతో చేయబోయే సినిమాలో శ్రీనిధినే ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని ఇన్సైడ్ రిపోర్ట్స్. ఈ సినిమా గనుక క్లిక్ అయితే శ్రీనిధి శెట్టికి కాలం కలిసొచ్చినట్లే. ప్రస్తుతం ఈ ప్రకటనను చిత్రబృందం హోల్డ్‌లో పెట్టారని తెలుస్తుంది. భగవంత్ కేసరి రిలీజైన తర్వాతే ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇచ్చే చాన్స్ ఉందట. అందులో మొదటి అప్డేట్ ఇదే అవ్వొచ్చని సమాచారం. ఎట్టకేలకు ఇన్నాళ్లకు శ్రీనిధి గుమ్మం వద్దకే ఆఫర్ వచ్చింది.