Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Srinidhi Shetty | సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ విజయం అందుకున్న తర్వాత హీరోలు, హీరోయిన్ల పారితోషికాలపై రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడం సహజం. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల రెమ్యునరేషన్లపై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
Srinidhi Shetty | సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ విజయం అందుకున్న తర్వాత హీరోలు, హీరోయిన్ల పారితోషికాలపై రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడం సహజం. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల రెమ్యునరేషన్లపై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటి శ్రీనిధి శెట్టి పారితోషికంపై ఇలాంటి ప్రచారమే తెరపైకి వచ్చింది. ఆమె ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రచారంపై స్పందించిన శ్రీనిధి శెట్టి అసలు విషయాన్ని వెల్లడించారు.
శ్రీనిధి శెట్టి ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇప్పటివరకు తాను చేసిన సినిమాల సంఖ్యను పరిశీలిస్తే ఇంత భారీ పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కేవలం పుకార్ల ఆధారంగా ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. సినిమాలను ఎంపిక చేసుకునేటప్పుడు పారితోషికానికే ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనకు నచ్చిన కథ, అందులో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం, సినిమా నాణ్యత వంటి అంశాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడించారు.
‘కేజీఎఫ్’ చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత వరుసగా ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, తాను అలా చేయలేదని శ్రీనిధి శెట్టి అభిప్రాయపడింది. డబ్బు సంపాదించడమే లక్ష్యమైతే ఆ సినిమా విజయాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రాజెక్టులకు అంగీకరించి ఉండేదాన్నని పేర్కొంది. మంచి కథలు, తన నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది తన ఉద్దేశమని ఆమె చెప్పుకొచ్చింది. సరైన కథ దొరికితే పారితోషికం విషయంలోనూ చర్చలకు సిద్ధంగా ఉంటానని, నటిగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే తనకు ముఖ్యమని స్పష్టం చేసింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్రీనిధి శెట్టి మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2016లో ‘మిస్ దివా సుప్రానేషనల్’ టైటిల్‌ను గెలుచుకుని, అదే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ‘మిస్ సుప్రానేషనల్’ కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

