సృష్టికర్త తన లీలలు చాటుకునే ప్రయత్నంలో.. కుందనపు బొమ్మనుచేసి, ప్రాణంపోసి, భూమ్మీదికి వదిలి ఉంటే.. ఆ కొంటెదనాల కొమ్మ పేరు శ్రీలీల అవుతుంది. ‘పెళ్లి సందD’తో కుర్రకారు గుండెల్లో అలజD రేపిందీ పూబాల. తాజాగా, మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘ధమాకా’లో నటించింది. ఈ మధ్యే జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో.. ఇలా వైట్ కలర్ రఫుల్ చీరలో మెరిసిపోయింది. చీర హైలైట్ అయ్యేలా లైట్ కలర్ లైన్ వర్క్ చేసిన ఫుల్నెక్ బ్లౌజ్ ఎంచుకుంది.
స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇవ్వడంతో.. బంగారు వన్నె భుజాలు కనిపించీ కనిపించనట్టు దోబూచులాడాయి. అసలే పిడికెడు నడుము. దానికి వడ్డాణంలాంటి ఫ్యాబ్రిక్ బెల్ట్! విరబోసిన కురులు అభిమానులను మరులుగొలిపాయి. ‘ఒట్టు.. నేనున్నా’ అన్నట్టు చిన్నపాటి బొట్టు. శ్రీలీల లీలగా కదిలిన ప్రతిసారీ ‘జీ హుజూర్’ అంటూ ఊగిపోయే జూకాలు. ఫ్యాషన్ స్పృహ శ్రీలీలలో పుష్కలం. అంటే, వెండితెర అవకాశాలూ పుష్కలమే!