Sri Vishnu | టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు సక్సెస్‌లు మాత్రం అందుకోలేపోతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘సింగిల్’ సినిమా సెట్స్ పై ఉంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో, కాల్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎంటర్టైన్మెంట్ కు న్యూ డోస్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
అమ్మాయిలను పడేయాలంటే మూడుదార్లురా..’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా , ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందినట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్స్, పంచ్ డైలాగ్స్ అదిరిపోయాయి. ‘వాళ్లు లేడీస్‌రా.. అంటే కాక్రోచ్స్. వాళ్లు చచ్చిపోరు. మనల్ని చంపుతారు.’, ‘ఓ మగాడు అమ్మాయిని ప్రేమిస్తే వాడి బతుకు మంచు కురిపిపోతుంది.’ అంటూ చెప్పే డైలాగ్స్ సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.
చిత్రంలో శ్రీ విష్ణు రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది. పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్, రాత్రి వేళల్లో రొమాంటిక్ వ్యక్తిగా కనిపించి సందడి చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేం బుల్లిరాజు సందడి చేయనున్నారు. ఓ వైపు వెన్నెల కిశోర్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్స్, పంచెస్ అదరగొట్టనుండగా.. బుల్లిరాజు కామెడీ సైతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. శ్రీ విష్ణు చివరి మూవీ ‘శ్వాగ్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ సినిమాతో అయిన మంచి హిట్ కొట్టాలని శ్రీ విష్ణు ఫ్యాన్స్ భావిస్తున్నారు.