శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ.రామస్వామి నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘కొడుకు బాధ్యత చూసుకుంటూ తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం.
కాశీ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ సినిమాలో శివ తత్వాన్ని చూపించే ప్రయత్నం చేశాం. చక్కటి కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది’ అన్నారు. దైవిక అంశాలతో పాటు తండ్రీకొడుకు మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించారు.