దీపక్ సరోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీమహా విష్ణు’. ‘ప్రతి హృదయానికీ ఒక కథ ఉంటుంది’ అనేది ఉపశీర్షిక. అనైరా గుప్తా, దీప్సిక కథానాయికలు. హరిహరన్ గోధగాని దర్శకత్వంలో శ్రీహరి తన్నీరు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. నాయకానాయికల మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఈ ఫస్ట్‌లుక్ ఆవిష్కరిస్తున్నది.
ప్రేమ, బాధ్యత, ఆత్మశోధన వంటి అంశాలను ఆవిష్కరించే అద్భుతమైన ప్రేమకథ ఇదని, దీపక్ సరోజ్ ఇందులో యువ చిత్రకారుడిగా భావోద్వేగపూరితమైన పాత్రలో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. రఘుబాబు, సుదర్శన్, రచ్చ రవి, జబర్దస్త్ ఆది తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ఆర్ట్స్.