Actress Sreeleela | సినీరంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. కొందరు నటీమణులకు ఎన్ని సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ లేదా రెండు సినిమాలతో రావలిసిన దానికంటే ఎక్కువే గుర్తింపు వస్తుంది. ఈ విషయంలో శ్రీలీల నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది. ‘పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించకపోయిన శ్రీలీల నటన, అందాల ఆరబోతకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమాతో శ్రీలీలకు తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. టాలీవుడ్ యువ హీరోలు దాదాపుగా ఈమె వైపే మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు మహేష్‌తో నటించే చాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం శ్రీలీలకు మహేష్‌బాబు సినిమాలో చాన్స్ వచ్చిందని టాక్. త్రివిక్రమ్-మహేష్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB28’ కోసం ఈమెను చిత్రబృందం ఎంపిక చేశారట. ఈ చిత్రంలో మేయిన్ లీడ్‌లో పూజా హెగ్డే నటించనుండగా.. సెకండ్ హీరోయిన్గా శ్రీలీల నటించనుందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో రవితేజ ధమాకా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ‘NBK108’లో బాలకృష్ణ కూతురిగా నటిస్తుంది. ఇవే కాకుండా రామ్-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లోనూ శ్రీలీల హీరోయిన్గా ఎంపికైంది.