అచ్చ తెలుగందం శ్రీలీలకు చేతినిండా సినిమాలున్నాయి. అవన్నీ భారీ ప్రాజెక్ట్‌లే. ఈ ఏడాది ‘తూ మేరీ జిందగీ హై’ చిత్రం ద్వారా హిందీలోకి కూడా అడుగుపెట్టి పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నది. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఈ భామకు భారీ ఆఫర్లు రావడం..యువతలో ఆమె క్రేజ్‌కు నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీలీల తన సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘త్వరలో..ఏజెంట్ మిర్చిగా శ్రీలీల’ అంటూ ఆ పోస్టర్‌పై క్యాప్షన్ కనిపిస్తున్నది. ఈ స్టిల్‌లో శ్రీలీల గాగుల్స్ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. దీంతో ఇది కొత్త సినిమా తాలూకు పోస్టరా? లేక ఏదైనా ఓటీటీకి సంబంధించిన షోనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ తాలూకు మరిన్ని వివరాలను ఈ నెల 19న వెల్లడిస్తానని శ్రీలీల హిం ట్ ఇవ్వడంతో..ఈ సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అనుకుంటున్నారు అభిమానులు.