Skanda Movie | నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరా అంటే పూజానో, రష్మిక పేరో చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరే వినబడుతుంది. నటనతో పాటు డ్యాన్స్‌లు కూడా అదరగొట్టడంతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అవి కూడా అశా మాశీ ప్రాజెక్ట్ లు కావు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లకు జోడీగా నటిస్తుంది. అంతేకాకుండా టైర్-2 హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా తనలోని మరో టాలెంట్‌ను కూడా బయటకు తీసింది. నిన్న జరిగిన స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తమన్‌తో కలిసి ఓ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాంతో ఫంక్షన్‌కు వచ్చిన జనాలంతా శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక పలువురు నెటీజన్లు శ్రీలీల మల్టీటాలెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక స్కంద సినిమాపై సినీ లవర్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిన్న రాత్రి రిలీజైన ట్రైలర్ కూడా ఊరమాస్‌గా ఉండటంతో జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు ట్రైలర్త స్పష్టమైపోయింది. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Sreeleela singing talent 👍@sreeleela14 #Skandapic.twitter.com/IHy39Tq5xp
— Suresh PRO (@SureshPRO_) August 26, 2023