Actress Sreeleela | ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది. డెబ్యూ సినిమాతో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్నా.. ధమాకాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటనే కాదు తన డ్యాన్స్‌లతోనూ అందరితో విజిల్స్ వేయించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే బుధవారం శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట లుక్ పోస్టర్ విడుదలైంది.
లేటెస్ట్ గా విడుదలైన శ్రీలీల లుక్ అదిరిపోయింది. లంగాఓణీలో అచ్చు పల్లెటూరి అమ్మాయిలా శ్రీలీల పోస్టర్ తెగ ఆకట్టుకుంటుంది. కాళ్లకు నేయిల్ పేయింట్ వేసుకుని కొంటెగా చూస్తూ యూత్ మతి పోగొడుతుంది. ఈ సినిమాలో శ్రీలీలకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పడినట్లు ఇన్ సైడ్ టాక్. అంతేకాకుండా త్రివిక్రమ్.. మహేష్-శ్రీలీల మధ్య మాస్ బీట్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం శ్రీలీల.. నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, బోయపాటి-రామ్ పోతినేని మూవీ, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలతో పాటు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కీరిటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్గా నటిస్తుంది. మొత్తానికి మరో రెండేళ్లు ఊపిరాడకుండా సినిమాలతో బిజీగా గడపనుంది.
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 – Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023