Sreeleela | టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న శ్రీలీల ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో తెగ రచ్చ చేస్తుంది. గత ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధమాకా విజయంతో శ్రీలీలకి చాలా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్లో ఒకానొక సమయంలో ఏకంగా అర డజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికి కూడా శ్రీలీల చేతిలో ఏకంగా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.
ఇటీవల కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్‌ను సొంతం చేసుకుంది.ఈ రోజు శ్రీలీల బర్త్ డే కాగా, ఆమెకి ప్రముఖులు, నెటిజన్స్ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేసింది. ఈ పోస్టర్లో శ్రీలీల చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ కప్ పట్టుకుని నిలుచొని సింపుల్ లుక్‌తో అదరగొడుతుంది. శ్రీలీల లుక్ తన అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో అడుగుపెట్టగా, ఆయనతో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయింది.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం శ్రీలీల చాలా బీజీగా ఉంది. ఆమె చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’, అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’, తమిళంలో శివ కార్తికేయన్ సరసన ‘పరాశక్తి’, హిందీలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా ‘ఆషిఖి 3’, కిరీటి రెడ్డి హీరోగా తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం ‘జూనియర్’ చిత్రాల్లో శ్రీలీల నటిస్తోంది. ఇందులో రెండు మూడు సినిమాలు హిట్ అయిన ఇక శ్రీలీలకి తిరుగు లేదు.