టాలీవుడ్ అగ్ర నాయిక శ్రీలీలకు బాలీవుడ్ సినిమాలపై కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఈ క్రమంలో కొన్ని తెలుగు సినిమాలను కూడా ఈ అందాలభామ రిజక్ట్ చేసిందని టాక్. ఈ విషయంపై ఇటీవల శ్రీలీల స్పందించింది. ‘పాత్రల ఎంపిక విషయంలో నాకు భాషతో సంబంధంలేదు. ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లో ఎక్కువ శాతం పాత్రలు నా వ్యక్తిత్వానికి భిన్నంగానే ఉన్నాయి.
కానీ ఈ మధ్యకాలంలో నేను విన్న బాలీవుడ్ కథలు నా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించే పాత్రల్లో నటిస్తున్నప్పుడు ఆ మజా వేరుగా ఉంటుంది. అప్పుడు నటించడానికి బదులు జీవిస్తాం. బాలీవుడ్లో నేను విన్న కథలన్నీ దాదాపు అలాగే ఉన్నాయి.’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ‘ఆషీకీ 3’ చిత్రంతో ఈ అమ్మడు బాలీవుడ్లో లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే.