Manchu Vishnu | టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో సింగిల్ అనే మూవీ రూపొందుతుంది. కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతుంది.. శ్రీవిష్ణు , వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ట్రైలర్లో నవ్వులు పూయించారు. అయితే, కామెడీ ట్రాక్‌లో సాగే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ట్రైలర్లో.. శ్రీవిష్ణు ‘శివయ్యా..’ అని అరుస్తూ ఉండడంపై విష్ణు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపించింది. అందుకు కారణం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్లో ఆయన శివయ్య అని గట్టిగా అరిచారు. దానిపై తెగ ట్రోలింగ్ నడిచింది.
ఇప్పుడు దానిని బేస్ చేసుకొనే సింగిల్’ ట్రైలర్లోనూ శ్రీ విష్ణు ‘శివయ్యా’ అంటూ వెటకారం చేసేలా అరవడం , ట్రైలర్ చివర్లో ‘మంచు కురిసిపోతుందని’ అంటూ శ్రీవిష్ణు డైలాగ్ చెప్పడంపై కూడా విష్ణు ఆగ్రహంతో ఉన్నారని కామెంట్స్ వినిపించాయి. వీటిపై డైరెక్టర్స్ అసోసియేషన్లోనూ కంప్లైంట్ చేస్తారనే రూమర్స్ వినిపించాయి. అయితే సింగిల్ ట్రైలర్ విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా, హీరో శ్రీ విష్ణు స్పందిస్తూ.. కన్నప్ప డైలాగ్ ఒక్కటే కాదని మరికొంతమంది హీరోలు, సినిమాల ప్రస్తావన కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు.
మేము ఎవరినీ బాధపెట్టాలని చేయలేదని అన్నారు. వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో శ్రీవిష్ణు ఓ వీడియో విడుదల చేశారు. కన్నప్ప టీమ్ మేము వాడిన డైలాగ్స్ కి హార్ట్ అయ్యారని తెలిసింది. అది కావాలని చేసింది కాదు. తప్పుగా కన్వే కావడంతో వెంటనే మేము స్పందించి ఆ డైలాగ్స్ తీసేస్తున్నాము. ఆ డైలాగ్స్ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. ప్రజెంట్ జనరేషన్ వాడే సినిమా రిఫరెన్స్ లు, మీమ్స్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్ గార్ల డైలాగ్స్ కూడా వాడాము. ఒక పాజిటివ్ గానే కామెడిగానే ఇవన్నీ చేసాము. అలాంటివి మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ. అలాంటివి ఎక్కువ రాకుండా చూసుకుంటాము. ఏమైనా ఇబ్బంది పెడితే సారీ. ఇండస్ట్రీ అంతా ఒకటే. హర్ట్ అయిన వాళ్లందరికీ సారీ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.