ఆయన కథానాయకుడిగా రూపొందిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ కథానాయిక. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. ఈ నెల 9న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ప్రెస్మీట్లో శ్రీవిష్ణు మాట్లాడారు. ‘ఈ రోజు మా ‘కామ్రేడ్ కల్యాణ్’.. రేపట్నుంచి కామెడీ కళ్యాణ్ అవుతాడు. ఈ సినిమాతో మాది రెండేళ్ల జర్నీ. ఒరిస్సా, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో ఎవరూ తీయని లోకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ఎక్కడా రాజీపడలేదు. శ్రీవిష్ణు కెరీర్లోనే మోస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్గా నిలిచే సినిమా ఇది’ అని సమర్పకుడు కోనవెంకట్ చెప్పారు. ఇంకా దర్శకుడు జానకిరామ్, నిర్మాత వెంకటకృష్ణ కూడా మాట్లాడారు.