SR kalyana mandapam | పొద్దున్నే విడుదల.. సాయంత్రానికి ఆన్లైన్లో పైరసీ ప్రింట్
SR kalyana mandapam | ఉదయం విడుదలైన ఈ సినిమా ప్రింట్ మధ్యాహ్నానికి ఆన్ లైన్లో దర్శనమివ్వడం దర్శక నిర్మాతలను కలవరపెడుతుంది. శ్రీధర్ గాదే SR కళ్యాణమండపం సినిమాను తెరకెక్కించాడు.

SR kalyana mandapam | ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. దీన్ని వదిలించేందుకు ఎంతమంది ప్రయత్నించినా.. సరైన పరిష్కారం దొరకట్లేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నసినిమాల వరకు ఈ పైరసీ భూతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా SR కళ్యాణమండపం సినిమాను కూడా పైరసీ బెడద తాకింది. పొద్దున సినిమా విడుదలైతే సాయంత్రం లోపు పైరసీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన SR కళ్యాణమండపం సినిమాను భారీ స్థాయిలోనే రెండు రాష్ట్రాల్లో విడుదల చేశారు. దాదాపు 650 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఉదయం విడుదలైన ఈ సినిమా ప్రింట్ మధ్యాహ్నానికి ఆన్ లైన్లో దర్శనమివ్వడం దర్శక నిర్మాతలను కలవరపెడుతుంది. శ్రీధర్ గాదే SR కళ్యాణమండపం సినిమాను తెరకెక్కించాడు. ఏదో పగ బట్టినట్లు పొద్దున్నే విడుదలైన సినిమాను సాయంత్రానికి పైరసీ చేసేయడం కంటే దుర్మార్గమైన పని మరోటి లేదంటున్నారు నిర్మాతలు. గతంలో కనీసం ఒక్క రోజైనా గ్యాప్ ఇచ్చి.. రెండో రోజు గానీ పైరసీ విడుదల చేసే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదని వాపోయారు.
ఉదయాన్నే విడుదల.. మ్యాట్నీ షో సమయానికి పైరసీ అన్నట్లుంది వ్యవహారం. పెద్దా చిన్న సినిమాలు అనే తేడా కూడా ఇక్కడ కనిపించడం లేదు. బొమ్మ విడుదలైతే పైరసీ చేశామా లేదా అన్నట్లుంది పరిస్థితి. ఓ వైపు కరోనాతో థియేటర్స్ వరకు ప్రేక్షకులు వస్తారో రారో అని కంగారు పడుతున్న సమయంలో ఈ పైరసీ బాధలతో నిర్మాతల గోడు వర్ణణాతీతంగా మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
SR Kalyana Mandapam Review| ఎస్.ఆర్.కల్యాణమండపం రివ్యూ
స్టార్ హీరోయిన్ ఇంట్లో డ్రగ్స్, మద్యం లభ్యం..అదుపులోకి తీసుకున్న పోలీసులు
కియారాను నయనతారతో పోల్చిన డైరెక్టర్
సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
బాలకృష్ణ మూవీ..సింపుల్‌గా తప్పించుకున్న శృతిహాసన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

