Squid Game: The Challenge | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). ఓటీటీల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్'(GOT), ‘మనీ హెయిస్ట్’ (Money Heist), స్ట్రేంజర్ థింగ్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి టాప్ వెబ్ సిరీస్‌లను వెనక్కినెట్టి వ్యూస్ పరంగా మొదటిస్థానంలో నిలిచింది. ఇక 2021 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్టయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. కాగా.. ప్రస్తుతం స్క్విడ్ గేమ్‌కు సీక్వెల్‌గా ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ (Squid Game Season 2) రెడీ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే సెకండ్ సీజన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సెకండ్ సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సెకండ్ సీజన్లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది రియల్ పీపుల్ పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
It’s time. Squid Game: The Challenge is now streaming! https://t.co/8HDVK7BSQq
— Netflix (@netflix) November 22, 2023
ఇక మొదటి సీజన్లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ… రెండో సీజన్లో కూడా నటించనున్నారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ స్క్విడ్ గేమ్ నటుల్లో కొత్తగా చేరారు. ఇదిలా ఉండగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. అంతేకాదు పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ సాధించింది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొంది.. ఆరు అవార్డులను గెలుచుకుంది.