Spy Movie Non-Theatrical Rights | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టిన పేరు యంగ్ హీరో నిఖిల్. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ‘కార్తికేయ-2′తో ఏకంగా తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. గతేడాది ’18పేజీస్’ కాస్త నిరాశపరిచిన, నిఖిల్ ఉన్న ఫామ్‌లో ఈ ఒక్క ఫ్లాప్ తన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని తాజాగా స్పై సినిమాకు జరిగిన బిజినెస్ లెక్కలను చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి.
కాగా తాజాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ సంస్థ, డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థలు దక్కించుకున్నాయి. కాగా ఈ రెండు హక్కులకు కలుపుకుని దాదాపు రూ.40 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. నిఖిల్ వంటి మీడియం రేంజ్ హీరోకు ఈ రేంజ్లో కేవలం నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే థియేట్రికల్ బిజినెస్‌తో కలుపుకుని స్పై సినిమా వంద కోట్ల మార్కు దాటినా ఆశ్యర్యపోనవసరం లేదు.
నిఖిల్ ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా కాస్త లేటయ్యేలా కనిపిస్తుంది.