Iswarya Menon | నెక్ట్స్ తెలుగు సినిమా ఏంటో చెప్పిన స్పై హీరోయిన్
Iswarya Menon | నిఖిల్ సిద్దార్థ నటిస్తోన్న తాజా చిత్రం స్పై (Spy). కోలీవుడ్ భామ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే మరో తెలుగు సినిమా అప్డేట్ అందించింది ఐశ్వర్య మీనన్.
Iswarya Menon| టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తోన్న తాజా చిత్రం స్పై (Spy) . థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పాపులర్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ భామ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే మరో తెలుగు సినిమా అప్డేట్ అందించింది ఐశ్వర్య మీనన్.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తర్వాత తెలుగు సినిమా ఏంటో క్లారిటీ ఇచ్చేసింది. కార్తికేయ (Kartikeya)హీరోగా నటిస్తోన్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్నానని, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలియజేసింది. 2022 ఏప్రిల్‌లోనే ప్రకటించిన ఈ సినిమాకు డైబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ ప్రస్తుతం బెదురులంక 2012 చిత్రంతో బిజీగా ఉన్నాడు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
స్పై ట్రైలర్..
నిఖిల్ స్పై టీజర్..
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

