Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ ఇంకా మొదలే కాలేదు, కాని ఈ మూవీ గురించి నిత్యం అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఇందులో దీపికా పదుకొణేని హీరోయిన్గా అనుకొని ఆమెకి స్టోరీ కూడా చెప్పాడు సందీప్. కాకపోతే ఆమె హ్యాండిచ్చింది. అనేక కండీషన్స్ పెట్టడంతో సందీప్.. యానిమల్ హీరోయిన్ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి అని అఫీషియల్‌గా ప్రకటించాడు. త్రిప్తి డిమ్రికి యానిమల్‌లో అవకాశం ఇచ్చిన సందీప్ ఇప్పడు ప్రభాస్ స్పిరిట్లోను అవకాశం ఇవ్వడంతో అమ్మడికి ఆనందానికి అవధులు లేవు.
త్రిప్తి డిమ్రీకి యానిమల్ చిత్రంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక స్పిరిట్ లోనూ అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఇవ్వడంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని అంటున్నారు. అంతేకాకుండా, ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కోరడం సందీప్‌కి నచ్చలేదట. అందుకే ఆమె స్థానంలో యానిమల్ నటి త్రిప్తి డిమ్రీకి స్పిరిట్ లో ఆఫర్ ఇచ్చారు సందీప్. అయితే ఈ సినిమాకి త్రిప్తికి ఏకంగా 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.
ఇదే నిజమైతే త్రిప్తి జాక్‌పాట్ కొట్టేసినట్టే. ఇక సినిమా ఆఫర్ రావడం పట్ల త్రిప్తి సంతోషం వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టింది. ఈ ప్రయాణంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను… ఈ ప్రయాణంలో నాపై నమ్మకం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సందీప్ రెడ్డి వంగా. మీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గౌరవంగా ఉంది అని రాసుకొచ్చింది. ఇక స్పిరిట్ విషయానికి వస్తే.. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అవి పూర్తైన వెంటనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి కనువిందు చేయనున్నాడు.