టాలీవుడ్ యువ దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు విరాటపర్వం (Virataparvam). 1990లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్ననటిస్తున్నారు. సాయిపల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..తాజాగా ఈ మూవీ నుంచి వెన్నెల పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేశారు మేకర్స్.
‘ వెన్నెల రెండు సార్లు జన్మించింది..ఆశయాన్ని ఆయుధం చేసినట్టు..అతని ప్రేమలో మరోసారి..ట్యాగ్ లైన్స్ తో నిర్బంధాలను కౌగిలించుకున్న వసంతకాలం మనది..రేపు మనమున్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది. మన ప్రేమకథను వినిపిస్తుంది..’ అంటూ సాయిపల్లవి చెబుతున్న డైలాగ్స్ మూవీ లవర్స్ లో జోష్ నింపేలా సాగుతున్నాయి. సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందని తాజా వీడియోతో తెలిసిపోతుంది.
విరాటపర్వం చిత్రాన్ని జులై 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్,నివేదా పేతురాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాటపర్వం చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.