Mandaadi | తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ప్రస్తుతం ఏ పేరు మారుమోగుతోంది అంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వినిపించే పేరు ‘మండాడి’. టాలెంటెడ్ హీరోలు సూరి మరియు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ప్రఖ్యాత ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రతిభావంతుడైన దర్శకుడు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, మౌత్ టాక్‌తో అసాధారణ వసూళ్లను రాబట్టుకుంటూ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సంచలనం సృష్టించింది.
తమిళనాడులో ఈ సినిమా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌లో కేవలం ఒక్క రాష్ట్రం నుంచే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ద్వారా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ఇక్కడ కూడా అదే జోరును ప్రదర్శించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అన్ని ప్రాంతాలలోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సూరి మరియు సుహాస్‌ల కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన సినిటాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘మండాడి’ నిలిచింది.
ఈ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రధానాంశం దీని నిర్మాణ విలువలు మరియు సాంకేతిక నిపుణుల ప్రతిభ. చిత్రంలో వచ్చే ఉత్కంఠభరితమైన బోట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ రేసింగ్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. సినిమాలోని యాక్షన్ ఘట్టాలు సీట్ల అంచున కూర్చోబెట్టేలా ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.ఆర్. కథిర్ అందించిన అద్భుతమైన విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాకు ప్రాణం పోసింది. ఇక పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ సంయుక్తంగా కంపోజ్ చేసిన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
ఈ చిత్రంలో నటీనటుల అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూరి మరియు సుహాస్‌లు తమ పాత్రలలో ఒదిగిపోయి జీవించారు. వారిద్దరిమధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, నటన సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. వీరికి తోడు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో తమ నటనతో సినిమా బలాన్ని మరింత పెంచారు. ఈ సినిమా చూసిన తర్వాత సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ స్వయంగా ఈ చిత్రాన్ని ప్రశంసించడం, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ అభినందించడం చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
దర్శకుడు మతిమారన్ పుగళేంది ప్రతిభ, నిర్మాత ఎల్రెడ్ కుమార్ రాజీ పడకుండా చేసిన నిర్మాణం, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్, డి.ఆర్.కె. కిరణ్ ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక మాస్టర్‌పీస్‌గా మలిచాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విజయవంతం కావడం ద్వారా ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలోనూ తన సత్తాను చాటింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.