Sonu Sood Niddhi song| లవ్ ట్రాక్ తో సోనూసూద్, నిధి అగర్వాల్ సాంగ్ టీజర్
సోనూసూద్ (Sonu Sood) , నిధి అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సాత్ క్యా నిభావోగే (Saath kya Nibhaoge) మ్యూజిక్ వీడియో సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. సోనూసూద్, నిధి అగర్వాల్ (Niddhi Agerwal) లవ్ ట్రాక్ తో సాగుతుందీ పాట.

తన సామాజిక సేవతో కోట్లాది మందికి రియల్ హీరోగా మారిన తర్వాత పాజిటివ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సోనూసూద్ (Sonu Sood). తాజాగా సోనూసూద్ నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘సాత్ క్యా నిభావోగే’ (Saath kya Nibhaoge) అంటూ సాగే సాంగ్ టీజర్ లో సోనూసూద్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) సందడి చేస్తున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నిధి అగర్వాల్, పింక్ కలర్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో సోనూసూద్ మధ్య సాగే లవ్ ట్రాక్ తో రొమాంటిక్ టచ్ ఇస్తూ సాగుతున్న పాట టీజర్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఈ పాటను కూడా పంజాబ్ లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన సాత్ క్యా నిభావోగే మ్యూజిక్ వీడియో ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. సోనూసూద్ ఇప్పటికే సునంద శర్మతో కలిసి పంజాబీ మ్యూజిక్ వీడియో పాగల్ నహీ హోనాలో నటించాడు. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టింది.
సోనూసూద్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ చేస్తున్న ఆచార్యలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు హిందీలో చంద్రప్రకాశ్ ద్వివేది డైరెక్షన్ లో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న పృథ్విరాజ్ లో నటిస్తున్నాడు. దీంతోపాటు తమిళ సినిమా కూడా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్‌లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

