Sonu Sood | సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సాయం చేసి ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించిన ఘనత సోనూసూద్‌ది. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేసి రియల్ హీరో అయ్యాడు. సినిమాలలో విలన్‌గా నటించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అని అనిపించుకున్నాడు.
అయితే ఇటీవల ముంబై-నాగ్‌పూర్ హైవేపై సోనూసూద్ భార్యకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాని గురించి సోనూ సూద్ మాట్లాడారు. వెనుక సీటు బెల్ట్ సేఫ్టీ గురించి వివరిస్తూ.. అది ఎంత ఇంపార్టెంటో చెప్పారు. వెనుక సీట్లో ఉన్నవాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోరు. కాని ప్రజలు ఈ అలవాటును మార్చుకోవాలి. కారులో ఎక్కడ కూర్చున్నా రెగ్యులర్‌గా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సోనూ సూద్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలతో బయటపడ్డట్టు చెప్పుకొచ్చారు. అందరూ రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించాలని , . ఇది ప్రాణాలకు సబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదు అని ఆయన అన్నారు.
కాగా, సోనూ సూద్ భార్య సోనాలి, ఆమె సోదరి, అల్లుడితో కలిసి ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తుండగా భారీ యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కును గుద్దడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. కానీ, కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కారణం ముగ్గురు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. అయితే సోనూసూద్ భార్యకి కారు ప్రమాదం అని తెలిసినప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరు కూడా ఆమె క్షేమంగా బయటపడాలని కోరారు.