హిందీ, తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూసూద్ (Sonu Sood). లాక్డౌన్ టైంలో వేలాదిమందికి నేనున్నానంటూ అండగా నిలబడి ఈ రీల్ లైఫ్ విలన్ కాస్తా రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. సోనూసూద్‌ను ఇక సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా చూసేందుకు ఇష్టపడనంతలా జనాలు మారిపోయారంటే ఈ టాలెంటెడ్ యాక్టర్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సోనూసూద్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఫతేహ్ (Fateh). భారీ బడ్జెట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో శ్రీలంకన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హై ఆక్టేన్-యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా రాబోతున్న ఈ మూవీని ఢిల్లీ, పంజాబ్‌లోని లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. తాజా టాక్ ప్రకారం యాక్షన్ సీక్వెన్స్ షూట్ కోసం లాస్ ఏంజెల్స్ నుంచి అంతర్జాతీయ స్థాయి టీం ఇండియాకు వచ్చింది.