Sonu Nigam | ఈ మధ్య ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ పలు వివాదాలతో వార్తలలో నిలిచారు. ఆయన ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్‌కి హాజరు కాగా, అక్కడ కన్నడ పాటలు పాడమని కొందరు ప్రేక్షకులు కోరారు. అయితే దానిపై , సోను నిగమ్ అసహనం వ్యక్తం చేస్తూ దానిని పహల్గామ్ ఉగ్రదాడితో పోల్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కర్ణాటక రక్షణ వేదిక ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోను నిగమ్‌పై నేరపూరిత బెదిరింపు, శాంతి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సోను దీనిపై స్పందించారు కూడా.
తన వ్యాఖ్యలు కొందరు అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తులను ఉద్దేశించి మాత్రమేనని, కన్నడ సమాజం మొత్తాన్ని కాదంటూ సోను నిగమ్ వివరణ ఇచ్చారు. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సోను నిగమ్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించి వర్చువల్‌గా హాజరు కావడానికి కోర్టు అనుమతించింది. అయితే ఒకవైపు కేసు విచారణతో సతమతం అవుతుంటే ఆయన ఊహించని ప్రమాదం నుండి బయటపడడం జరిగింది. సోను నిగమ్ కారు దిగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఒక కారు అకస్మాత్తుగా ఆయన వైపు దూసుకొచ్చింది. తృటిలో పెద్ద ప్రమాదం నుండి ఆయన తప్పించుకున్నారు.
ముంబైలో ఈ ఘటన జరిగింది. ఆయన వైపు కారు అకస్మాత్తుగా దూసుకురాగా, సోను నిగమ్ వెంటనే అలర్ట్ అయి వెనక్కి జరిగారు. అప్పుడు కారు డ్రైవర్ కూడా బ్రేకులు వేశాడు. అయితే ఆ సమయంలో సోను నిగమ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. డ్రైవర్‌కి బ్రేకులు మీద కంట్రోల్ తప్పడంతో, రోడ్డు దాటుతున్న సోను నిగమ్ వైపు కారు వెళ్లిందని, ఆయన అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని అంటున్నారు. అయితే ఆ సమయంలో సోను నిగమ్‌కి ఆ డ్రైవర్‌పై తీవ్రమైన కోపం వచ్చిన కూడా కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.