మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. అర్జున్ దాస్యన్ నిర్మాత. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన’ అనే పల్లవితో సాగే గీతాన్ని కథానాయిక పూజాహెగ్డే శుక్రవారం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మేఘ ఎవరూ? ఆమెతో ప్రేమలో పడిన ఇద్దరబ్బాయిల కథేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. “ఆమని ఉంటే పక్కన’ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం, హరిగౌర బాణీలు, అనురాగ్ కులకర్ణి గాత్రం చక్కగా కుదిరాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్‌పూడి.