Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ నటి సోనమ్ కపూర్ ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. తన అందచందాలతో అందరినీ కట్టిపడేశారు. సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సోనమ్ పాల్గొని సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ రామి కది రూపొందించిన ఎరుపు రంగు పొడవాటి గౌను ధరించిన సోనమ్.. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోనమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతకు ముందు వానిటీ ఫెయిర్ డిన్నర్లో సోనమ్ పసుపు రంగు దుస్తులు ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తల్లి అయిన తర్వాత మొదటిసారిగా సోనమ్ ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ‘వార్.. సూపర్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో 2018లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.