Son of india | కరోనా ఉదృతి తగ్గడంతో వాయిదా పడ్డ సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాలు విడుదలతేదీలను ప్రకటించగా తాజాగా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఈక్రమంలోనే మొహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన ఇచ్చారు.
సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో అంచనాలను పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ చేయలేని పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నాడని యాక్షన్ అంశాలతో పాటు ఈ సినిమాలో మంచి మేసేజ్ కూడా ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు.నటుడు శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్ కీలకపాత్రలో నటించగా తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:సర్వేశ్మురారి, ఎడిటింగ్:గౌతంరాజు.