NKR 21 | బింబిసార తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే NKR21 అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఇందులో పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలు చూడొచ్చు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సోహైల్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ సోహైల్ఖాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లుక్ ఒకటి విడుదల చేశారు.
ఈ చిత్రంతో సోహైల్ ఖాన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీలో సయీ మంజ్రేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ బ్యానర్లో అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.అశోక క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న రెండో సినిమా ఇది.
ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్సైడ్ టాక్. బ్రహ్మ కడలి టీం వేసిన సెట్ డిజైన్‌లో ఫైట్ మాస్టర్ రామకృష్ణ నేతృత్వంలో కల్యాణ్ రామ్‌తోపాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులపై వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగనుందట.
సోహైల్‌ఖాన్ సూపర్ స్టైలిష్ లుక్ ..
Wishing the evildoer in #NKR21, @SohailKhan a very Happy Birthday ❤️🔥
Welcome to Telugu Cinema, sir. We are delighted to have you on board ✨@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa @AJANEESHB @NTRArtsOfficial… pic.twitter.com/w6QbqUC4h1
— BA Raju’s Team (@baraju_SuperHit) December 20, 2024
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్
Shankar | గెట్ రెడీ అంటోన్న శంకర్.. థియేటర్లలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3