బిగ్ బాస్ షోతో సోహైల్ కథ పూర్తిగా మారింది. ఆయనకు పలు సినిమా ఆఫర్స్‌తో రావడం, పలువురు సెలబ్రిటీలతో కలిసి కొద్ది సేపు ముచ్చటించే అవకాశం దక్కడం జరిగింది. బిగ్ బాస్ షోతో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నసోహైల్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడిని కలిసాడు.ఇద్దరి మధ్య కొద్ది సేపు డిస్కషన్ జరగగా, ఇది సినిమాకు సంబంధించినది కాదని చెప్పుకొచ్చాడు సోహైల్.
బిగ్ బాస్ ఫినాలే సమయంలో అనీల్ రావిపూడి హౌజ్‌లోకి వెళ్లి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సోహైల్లా కథ వేరుంటది అంటూ వినోదాన్ని పంచారు. అదే సమయంలో సోహైల్ మీ సినిమాలో ఛాన్స్ కావాలని అనీల్ రావిపూడిని కోరిన విషయం తెలిసిందే.అయితే రీసెంట్గా అనీల్‌ని కలిసిన సోహైల్ తన ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేస్తూ.. జీరో యాటిట్యూడ్, ఎంతో మంచి మనిషి, ఎంతో ఇంటెలిజెంట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిసే చాన్స్ వచ్చింది . సాధారణంగా కలిసాను. బిగ్ బాస్ రోజులు గుర్తు తెచ్చుకున్నాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్స్. మిమ్నల్ని మరోసారి కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను సర్ అంటూ సోహైల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.