Sohail | బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. మరో 20 రోజులలో ఈ సీజన్‌కి పులిస్టాప్ పడనున్న నేపథ్యంలో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ కంటెస్టెంట్స్‌ని ఒక్కొక్కరిగా లోపలకి పంపిస్తున్నారు. వారు టాస్క్‌లలో పాల్గొనడం, కామెడీతో అలరించడం చేస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో సోహైల్ హంగామా ఉండనుంది. సోహైల్ అంటే కథే వేరుగా ఉంటుంది అన్న మాట మరోసారి నిజమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన, తనదైన శైలిలో హౌస్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ నింపేశాడు.
ఇప్పటి వరకు వచ్చిన గెస్ట్లెవ్వరికీ ఉండని ఎనర్జీ, హాస్యం, తన మార్క్ స్టైల్‌తో తెగ సందడి చేశాడు. వెనుక ద్వారం నుంచి డీజే టిల్లూ పాటకు స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించాడు. సీజన్ 4లో సొహైల్ అంటే గుర్తొచ్చేది ఆయన చేసిన చికెన్–మటన్ వార్. ఆ సీజన్లో చిరంజీవిగారు కూడా ప్రత్యేకంగా మటన్ బిర్యానీ తీసుకొచ్చారంటే సొహైల్ క్రేజ్ ఏ మేర ఉందో అర్థమవుతుంది. అదే జోష్‌తో సీజన్ 9 హౌస్‌లో అడుగుపెట్టగానే నాన్ వెజ్ లేకుండా ఆరు వారాలు ఎలా ఉన్నారు? నేను అయితే దూకి వెళ్లిపోయేవాడ్ని అంటూ తన స్టైల్లో ఫన్ ప్రారంభించాడు. కెమెరా ముందు బిగ్ బాస్‌తో మాట్లాడుతూ.. “ఇది నా ఇజ్జత్‌కే సవాల్ బిగ్ బాస్… రెండు పాలపాకెట్లు, చికెన్, కాఫీ పౌడర్ పంపించండి అంటూ బిల్డ్అప్ ఇచ్చాడు.
అయితే బిగ్ బాస్ ప్యాకెట్ల బొమ్మల్ని పంపించాడు. అవి చూసి సొహైల్ షాక్ అయ్యి “ఏంటి బిగ్ బాస్… ఇజ్జత్ తీసినవుగా!” అని అనడంతో అందరు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఆ తర్వాత అసలైన చికెన్, పాలపాకెట్లు, కాఫీ పౌడర్ పంపించడంతో హౌస్ మొత్తం “చికెన్… చికెన్… మటన్… మటన్…” అంటూ సొహైల్ సిగ్నేచర్ స్టెప్‌లో మునిగిపోయింది. సొహైల్ బాడీ లాంగ్వేజ్, బిల్ట్అప్లను గమనించిన భరణి, రీతూ ఎంట్రీ నుండి సాగిన ప్రతి ఫన్నీ మూమెంట్ నవ్వుల వర్షం కురిసేలా చేసింది. సీజన్ 4లోని “కథ వేరుంటది” డైలాగ్‌ను గుర్తు చేస్తూ సొహైల్ చెప్పిన ప్రతి లైన్ హౌస్‌లో ఎనర్జీని పెంచింది. చిన్న ఎంట్రీ అయినా, సొహైల్ హౌస్‌లో పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్లాడు. ఈ కారణంగా సీజన్ 4ని ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సీజన్ అంటారు.