Sobhita Dhulipala | ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ 2లో వన్ ఆఫ్ ది కీ రోల్లో మెరిసింది శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala). గ్లామరస్ పాత్రలోనైనా, పర్ఫార్మెన్స్ ఓరియెంట్ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే టాలెంట్ ఈ అమ్మడి సొంతం. ట్రెండీ, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే భామలకు టాలీవుడ్లో కొదవేమి లేదు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది శోభితా ధూళిపాళ.
ఎక్కువగా పొట్టి, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసే ఈ తెనాలి భామ ఈ సారి మాత్రం రూటు మార్చేసింది. సంప్రదాయ చీరకట్టు (white cotton saree)లో అందాల ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సింపుల్ వైట్ కాటన్ శారీలో టెర్రస్‌పై చక్కర్లు కొడుతూ.. నడుమందాలను చూపిస్తూ.. హోమ్లీ లుక్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. చాలా కాలం తర్వాత తనలోని అచ్చ తెలుగు అందాన్ని మరోసారి అందరికీ పరిచయం చేస్తున్న స్టిల్స్ కుర్రకారు మనసు దోచేస్తున్నాయి.
ఓర చూపుతో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ సితారలో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుంది. శోభితా ధూళిపాళ మరోవైపు అమెరికన్ ఫిల్మ్ మంకీ మ్యాన్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ టైటిల్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.