Sobhita Dhulipala | నాగచైతన్య (Naga Chaitanya)తో రిలేషన్ షిప్ పై నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) మరోసారి స్పందించింది. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో చివరిసారిగా కనిపించిన శోభిత.. తదుపరి ‘నైట్ మేనేజర్ పార్ట్- 2’ (The Night Manager Part 2)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతుల గురించి స్పందించింది.
ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతుల గురించి మాట్లాడుతూ.. అలాంటి వార్తలు తనను ఏమాత్రం బాధించవని చెప్పింది. అదేవిధంగా ప్రేక్షకులు తన వ్యక్తిగత విషయం గురించి కాకుండా తన వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తానని తెలిపింది. ఎందుకంటే, తాను వైజాగ్ నుంచి వచ్చానని.. ఈ స్థాయికి చేరడానికి ప్రతి దశలోనూ ఎంతో కష్టపడినట్లు తెలిపింది.
ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా స్పందించింది. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో వివరించింది. ‘జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఈ జీవితం చాలా చిన్నదన్న విషయాన్ని అర్థం చేసుకొని.. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభిత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Uttar Pradesh | ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు.. ఆపై వరుడి తమ్ముడితో వివాహం
Honduras women Jail | హోండురస్ జైలులో ఘర్షణ.. 41 మంది మహిళా ఖైదీలు మృతి
MLA | పబ్లిక్‌లో ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే