MLA | పబ్లిక్‌లో ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే
MLA | మహారాష్ట్ర (Maharashtra)లో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందూ ఓ ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
MLA | మహారాష్ట్ర (Maharashtra)లో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందూ ఓ ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
థానే (Thane) జిల్లా మీరా భయందర్ ( Mira Bhayandar) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆక్రమణలను అధికారులు కూల్చివేత చేపట్టారు. ఇందులో భాగంగానే కాషిమిరాలోని పెంకర్ పెడా ప్రాంతంలో గల అక్రమ నిర్మాణాలను ఇంజినీర్ లు శుభమ్ పాటిల్, సోనీ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో కూల్చివేతలు చేపట్టడంతో ఆరు నెలల చిన్నారి సహా వృద్ధులు వర్షంలోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ (Geeta Jain) అక్కడికి చేరుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంజినీర్లతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ వారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌పై చేయిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల కూల్చివేతలో తప్పేముంది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంజినీర్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తన చర్యను ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज शेषाबाई व्यंकटराव चव्हाण) (@surajvchavan) June 20, 2023
Also Read..
Train | 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ యువకుడు
Yoga Day | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్రపతి
Elon Musk: వీలైనంత త్వరగా ఇండియాకు టెస్లా కంపెనీ: ఎలన్ మస్క్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

