Honduras women Jail | హోండురస్ జైలులో ఘర్షణ.. 41 మంది మహిళా ఖైదీలు మృతి
Honduras women Jail | సెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో దారుణం చోటు చేసుకుంది. మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
Honduras women Jail | సెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో దారుణం చోటు చేసుకుంది. మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా (Tamara) మహిళా జైలు (womens prison) లో మంగళవారం ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో సుమారు 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలులో ఉన్న రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణహోమానికి కారణమని తెలుస్తోంది.
జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు తాజా ఘటనపై హోండురస్ అధ్యక్షురాలు (Honduran President) జియోమర క్యాస్ట్రో (Xiomara Castro) స్పందించారు. మహిళా ఖైదీల మరణాలు.. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read..
MLA | పబ్లిక్‌లో ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే
Yoga Day | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్రపతి
Train | 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ యువకుడు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

