Naga Chaitanya – Sobitha | సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ శోభితని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత చైతూకి తండేల్ రూపంలో పెద్ద హిట్ దక్కింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ రావడంతో మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నారు చైతూ. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళా విశేషమంటూ అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా శోభిత ధూళిపాళ్ల ప్రగ్నెంట్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అక్కినేని కుటుంబంలో ఓ చిన్నారి అడుగు పెట్టబోతున్నాడని తెలిసి అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే అవన్నీ ఫేక్ అని అక్కినేని కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి శోభిత ప్రగ్నెంట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అందుకు కారణం శోభిత చీరకట్టు అని అంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ 2025 ఈవెంట్లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీర కట్టులో కనిపించడం తో మళ్లీ ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల ఆమె ధరిస్తున్న వస్త్ర శైలిని గమనించిన కొంతమంది, ఆమె గర్భవతిగా ఉండొచ్చని ఊహించుకుంటున్నారు. ఈ విషయంపై ఓ మీడియా సంస్థతో చైతు, శోభిత సన్నిహితులు ఇలా స్పందించారట. ఆమె వేసుకుంది మేటర్నిటీ డ్రెస్సు కాదు, యాంటీ-ఫిట్ డ్రెస్సు . కేవలం వస్త్ర ధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యంగా ఉంది అని అన్నారట. దీంతో పుకార్లకి పులిస్టాప్ పడింది.
సమంత నుండి విడిపోయిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డ నాగ చైతన్య కొన్నాళ్లు వారి రిలేషన్‌ని సీక్రెట్‌గా ఉంచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఒక సాధారణ ఇంటరాక్షన్‌తో ఈ ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. వీరిద్దరికీ తెలుగు భాషపై ఉన్న ప్రేమ, ఉమ్మడి అభిరుచులు మరింత దగ్గర చేశాయి అని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2024 ఆగస్టు 8న హైదరాబాద్ లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్, హైదరాబాద్‌లో తెలుగు సంప్రదాయ పద్దతి లో వివాహం చేసుకున్నారు. ఇటీవల శోభిత వేషదారణ అభిమానుల్లో కొత్త అనుమానాలు పుట్టిస్తున్నాయి. అయితే అది కేవలం ఫ్యాషన్ స్టైల్ మాత్రమేనని స్పష్టమవుతోంది.