Sobhita Dhulipala | అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటూ.. వెకేషన్స్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటుంది. ఇటీవల తమిళనాడులో పర్యటించింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. తమిళనాడులోని పురాతన ఆలయాలను సందర్శించింది. అయితే, ఏ ఆలయాన్ని సందర్శించిందో మాత్రం చెప్పలేదు. ఆలయ శిల్ప సౌందర్యానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
Sobhita Dhulipala
స్థానికంగా లభించే ఫిల్టర్ కాఫీని సైతం ఆస్వాదించింది. ‘అద్భుతం’ అంటూ ఫొటోలను జోడించింది. అయితే, శోభిత కుంభకోణంలోని సారంగపాణి ఆలయంతో పాటు రామేశ్వర స్వామి, ఆది కుంభేశ్వర స్వామి ఆలయాలను దర్శించినట్లు సమాచారం. ఆలయానికి వెళ్లిన సందర్భంలా ట్రెడిషనల్ వేర్లో దర్శనమిచి.. అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు ఓ నెటిజన్ గార్జియస్ అంటూ కామెంట్ చేయగా.. మరో యూజర్ పెళ్లి అయ్యాక మీ అందం మరింత పెరిగిందంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ నటించింది. ఇటీవల టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెకేషన్స్‌కు వెళ్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న శోభిత వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నది. గత వారం వీకెండ్లో చైతు, శోభితా ఇద్దరు తమిళనాడు కాంచీపురం జిల్లాలో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ని వీక్షించారు. ఇక శోభిత చివరిసారిగా ‘లవ్ సితార’ మూవీలో కనిపించింది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘జీ2’ మూవీలో కీలకపాత్రలో శోభిత నటించనున్నట్లు తెలుస్తున్నది.
Sobhita Dhulipala