Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
Sobhita Dhulipala | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కథానాయిక శోభిత ధూళిపాళ మరోసారి తన తాజా ఫోటోషూట్‌తో వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య భార్యగా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం ఆమె చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది.
Sobhita Dhulipala | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కథానాయిక శోభిత ధూళిపాళ మరోసారి తన తాజా ఫోటోషూట్‌తో వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య భార్యగా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం ఆమె చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కోసం శోభిత ధూళిపాళ ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. ఇందులో ఆమె బికినీతో పాటు దానిపై నెట్ తరహా దుస్తులను ధరించి కనిపించారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో కొందరు ఆమె స్టైలిష్ లుక్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇంత బోల్డ్‌గా ఫోటోషూట్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ ఫోటోషూట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శోభిత గతంలో ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ది నైట్ మేనేజర్’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆయా కథలు, పాత్రలకు అనుగుణంగా ఆమె చేసిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత కూడా ఆ సన్నివేశాలు, గతంలో చేసిన ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో మరోసారి వైరల్ అయ్యాయి. తాజా ఫోటోషూట్‌పై కూడా కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఆమెకు మద్దతుగా స్పందిస్తున్నారు. ఒక నటిగా తనకు నచ్చిన పాత్రల్లో నటించడం, తన వృత్తిలో భాగంగా ఫోటోషూట్లు చేయడం వ్యక్తిగత నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి తర్వాత మహిళల దుస్తులు, వృత్తిపరమైన ఎంపికలపై విమర్శలు చేయడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో సమంత కూడా తన దుస్తులు, గ్లామరస్ ఫోటోషూట్ల విషయంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శోభిత విషయంలోనూ ఇలాంటి చర్చ జరగడం గమనార్హం. ఇక సినిమాల విషయానికి వస్తే, శోభిత ప్రస్తుతం తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువమ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్నానని, చాలాకాలంగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని ఆమె గతంలో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

