టాలీవుడ్ సినీ పరిశ్రమలో వున్న పలు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి సినీ పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు. ఆ కోవలోనే ఇటీవల నిర్మాతల మండలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లు ఓటీటీలు, వీపీఎఫ్ చార్జీలు, టికెట్ ధరలు, బడ్టెట్ పలు అంశాలపై చర్చలు జరిపారు. వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తాజాగా చిన్న సినిమాలకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 4కోట్ల రూపాయల బడ్జెట్‌గా వున్న దానిని చిన్న సినిమాగా గుర్తిస్తున్నట్లుగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తెలిసింది.
తమ సినిమా చిన్న సినిమాగా పరిగణించాలంటే సినిమా చిత్రీకరణకు 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తును ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్లో వున్న కమిటీ పరిశీలించి నిర్ధారణ చేస్తుందని దానిని ఫెడరేషన్ ఆమోదించి 15 శాతం వేతన రాయితీని కలిపిస్తుందని, చిన్న సినిమాగా ఆమోదించిన తరువాత ఫెడరేషన్ సదరు నిర్మాతకు 15 శాతం తగ్గించి వేతనాలు తీసుకోవాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.