Skanda Movie OTT | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinivas) కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో నవంబర్ 02 నుంచి స్కంద స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
The clock is ticking for this heart-pounding action flick 🧨🥳 #Skanda will be streaming from 2nd Nov! #RaPoRampageonHotstar #DisneyPlusHotstar pic.twitter.com/r6l83G0Wo3
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 28, 2023
ఇదిలా ఉంటే.. అంతకుముందు ఈ సినిమా ఈ నెల ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్టోబర్ 27 నుంచి ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇన్సైడ్ టాక్ నడిచింది. అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ డిస్నీ+హాట్‌స్టార్ తాజాగా ప్రకటించింది.