Skanda Movie Songs | రామ్-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమాపై సినీ లవర్స్‌లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెంచలేదు. బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు గ్లింప్స్‌తోనే స్పష్టమైపోయింది. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్ల క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అందలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది.
నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే పెప్పీ నెంబర్ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఇంగ్లీష్ వోకల్స్‌తో సాగిన ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా ఈ పాట కోసం వేసిన సెట్టింగ్ మాత్రం గ్రాండియర్‌గా కనిపించింది. థమన్ స్వర పరిచిన ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న రిలీజ్ కాబోతుంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.