Sivakarthikeyan | రియల్ హీరో అనిపించిన శివ కార్తికేయన్.. పరిచయం లేని నటుడికి ఏకంగా రూ.50 లక్షల సాయం
Sivakarthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన మంచి మనసుతో మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తను చేసిన మంచి పనులను ఎక్కడా ప్రచారం చేసుకోని ఈ హీరో, అవసరంలో ఉన్నవారికి సైలెంట్‌గా సహాయం చేస్తుంటాడు. తాజాగా అలాంటి ఒక సంఘటన బయటకు రావడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Sivakarthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన మంచి మనసుతో మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా తను చేసిన మంచి పనులను ఎక్కడా ప్రచారం చేసుకోని ఈ హీరో, అవసరంలో ఉన్నవారికి సైలెంట్‌గా సహాయం చేస్తుంటాడు. తాజాగా అలాంటి ఒక సంఘటన బయటకు రావడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న శివ కార్తికేయన్, ‘అమరన్’ వంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. స్వయం కృషితో ఎదిగిన ఈ హీరోకు సామాజిక స్పృహ ఎక్కువగా ఉండటంతో, తన వంతు సహాయం చేస్తూ ఉంటాడు. ఇటీవల కోలీవుడ్ నటుడు ప్రేమ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ చేసిన సహాయం గురించి వెల్లడించాడు. ఇద్దరూ కలిసి ‘హీరో’ సినిమాలో పనిచేసిన సమయంలో జరిగిన ఈ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నాడు.
షూటింగ్ సమయంలో తన కుమారుడిని ఉన్నత విద్య కోసం నెదర్లాండ్స్ పంపాలనుకున్నప్పటికీ, అవసరమైన డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇల్లు తాకట్టు పెట్టాలని భావించినా, అది ఈఎంఐలో ఉండటంతో బ్యాంకులు రుణం ఇవ్వడానికి నిరాకరించాయని చెప్పారు.ఈ విషయాన్ని శివ కార్తికేయన్‌కు చెప్పగా, వెంటనే స్పందించిన ఆయన తన పేరుపై పూచీకత్తుగా నిలిచి బ్యాంకు ద్వారా రూ.50 లక్షల రుణం ఇప్పించాడని ప్రేమ్ కుమార్ వెల్లడించాడు. ఈ సహాయం వల్ల తన కుమారుడు విదేశాల్లో చదువు పూర్తి చేసి, ప్రస్తుతం నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిపారు.
అతనితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఒక సినిమా మాత్రమే కలిసి చేశాం. అయినా సరే నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇంత పెద్ద సాయం చేశారు. ఆయన నిజంగా గొప్ప మనసున్న వ్యక్తి అంటూ ప్రేమ్ కుమార్ ప్రశంసించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు శివ కార్తికేయన్‌ను ‘రియల్ హీరో’ అంటూ కొనియాడుతున్నారు. సినిమా విజయాలకే కాకుండా, మనసు మంచితనంతో కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీగా ఉన్న శివ కార్తికేయన్, ఇటీవల ‘తాయ్ కిళవి’ చిత్రంతో నిర్మాతగా కూడా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సేయాన్’ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

