Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కంగువ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియోను విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన కంగువ పోస్టర్లు సోషల్ మీడియాను వైరల్ అవుతున్నాయి. తాజాగా శివ టీం కొత్త స్టిల్‌తో అప్డేట్ అందించింది.
కంగువ వైబ్స్ అంటూ సెట్స్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్, సినిమాటోగ్రాఫర్ వెట్రి పలనిస్వామి, డైరెక్టర్ శివ దిగిన స్టిల్‌ను షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడీ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కంగువ యాక్షన్ సీక్వెన్స్‌తో సెగలు రేపడం గ్యారంటీ అని తాజా స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నారు శివ టీం. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ ఉండబోతుందని సమాచారం. కంగువ సీక్వెల్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్
కంగువలో సూర్య ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త అవతార్‌లో వారియర్‌గా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. కంగువ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. వారియర్.. లీడర్.. కింగ్.. సూర్య రాజసం ఉట్టిపడేలా గుర్రంపై వస్తున్న వారియర్ లుక్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023