మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామమ్ (Sita Ramam). వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహించాడు. రష్మిక మందన్నా, సుమంత్ అక్కినేని, తరుణ్‌భాస్కర్, వెన్నెల కిశోర్ , భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటించారు.
కాగా ఈ మూవీ విడుదలైన రోజు నుంచి మంచి టాక్‌తోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.33 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు ఇన్ సైడ్ టాక్. తొలి రోజు మంచి టాక్ రావడంతో అప్పటి నుంచి థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరుగుతోందట.
ఏ సెంటర్స్ తోపాటు బీ, సీ సెంటర్లలో కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో నిర్మాతలకు మరిన్ని డబ్బులు తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. స్వప్నా సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బ్యాక్ బోన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటించాడు.