వెండి వెలుగుల సితార
వేవేల వెలుగుల తారకలా వెండితెరపై కొంగొత్త కాంతుల్ని వర్షించింది అగ్ర హీరో మహేష్‌బాబు ముద్దుల తనయ సితార. ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘ఎవ్రీ పెన్నీ..’ మ్యూజిక్ వీడియో ద్వారా ఈ గారాలపట్టి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. శనివారం ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సితార చూడముచ్చటైన నృత్యరీతులతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చక్కటి ఈజ్‌తో లిటిల్ ప్రిన్సెస్ సితార చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు సంబరపడుతున్నారు.
వేవేల వెలుగుల తారకలా వెండితెరపై కొంగొత్త కాంతుల్ని వర్షించింది అగ్ర హీరో మహేష్‌బాబు ముద్దుల తనయ సితార. ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘ఎవ్రీ పెన్నీ..’ మ్యూజిక్ వీడియో ద్వారా ఈ గారాలపట్టి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. శనివారం ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సితార చూడముచ్చటైన నృత్యరీతులతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చక్కటి ఈజ్‌తో లిటిల్ ప్రిన్సెస్ సితార చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఈ పాటలో మహేష్‌బాబు కూడా సందడి చేశారు. నేడు పూర్తి గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ‘ఎవ్రీ పెన్నీ..ఎవ్రీ పెన్నీ లెట్స్ నో ఎవ్రీ పెన్నీ..నీదే అవనీ, నాదే అవనీ..రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..’ అంటూ సాగే ఈ గీతానికి తమన్ స్వరాల్ని సమకూర్చారు. ‘ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి పాట, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ‘పెన్నీ..’ గీతం కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. మహేష్‌బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

