దుల్కర్ సల్మాన్, మృణాళికి ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. స్వప్న సినిమా పతాకంపై దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో భావోద్వేగాలు నిండిన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ…‘ఇదొక మ్యాజికల్ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్‌ని మీరంతా ఇష్టపడతారు. మైనస్ డిగ్రీ వాతావరణంలో సినిమాను చిత్రీకరించాం. కోవిడ్ టైమ్‌లో అందరిలాగే మా సినిమాకూ ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ సినిమా మేకింగ్ చాలా క్లిష్టమైనది. నిర్మాత స్వప్న, హీరో దుల్కర్ సహకారం వల్లే సాధ్యమైంది’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ…‘నా కెరీర్లో 35కు పైగా సినిమాల్లో నటించాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఎన్నో విభిన్నమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో నటించడం ద్వారా దేశంలోని ఎన్నో ప్రాంతాలను చూడగలిగాను. దర్శకుడు హను రాఘవపూడికి సినిమానే లోకం. షూటింగ్ గురించి ఆలోచిస్తూ తనను తాను మర్చిపోతారు. ఇది నా సొంత నిర్మాణ సంస్థలా భావిస్తా.
ఇది చెప్పాల్సిన ప్రేమ కథ. ఎపిక్ లవ్ స్టోరీ. మీ అందరికీ నచ్చుతుంది. మలయాళం కంటే తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తారు. ఇక్కడి ప్రేక్షకులు కోరుకునే తరహా సినిమాలు వేరు’ అన్నారు. నిర్మాత స్వప్న మాట్లాడుతూ..‘మహానటి సినిమా టైమ్‌లో మా మీద దుల్కర్‌కు నమ్మకం లేదు. కథ నచ్చి సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మాకు మం చి మిత్రుడు అయ్యారు. నేను ఆయనకు కథ పంపాలంటే ఎంతో వడబోసి, బెస్ట్ స్క్రిప్ట్ పంపిస్తా. అలా పంపిన సినిమానే ‘సీతా రామం’. కథ విన్న వెంటనే నటిస్తానని చెప్పారు’. అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.