సిరివెన్నెల చివరి పాట తలచుకుని ఎమోషనల్ అయిన డైరెక్టర్ మారుతి
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..

Sirivennela Seetharama Sastry | దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాటలలో ఇవి కూడా ఉంటాయి. 10 మందిని ప్రభావితం చేసే పాట రాయాలంటే సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదు. ఆయన కెరీర్లో అలాంటి ఎన్నో అద్భుతమైన ప్రభావవంతమైన పాటలు తెలుగు కళామతల్లికి ప్రేక్షకులకు అందించారు సీతారామశాస్త్రి. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ సినిమాలో ఉంది.
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. జనవరి 31 ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2న పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల చివరిసారి రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండటంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు.
మరణం గురించి ముందే తెలిసినట్టు సిరివెన్నెల కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. ఆయన్ను గుర్తు చేసుకున్నాడు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు ఉన్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్లో ఉంటాయని మారుతి చెప్పారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
sirivennela | సిరివెన్నెల నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారో తెలుసా.. రెమ్యునరేషన్ ఎంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

